రేపు నిజామాబాద్ లో జంట పుస్తకాల ఆవిష్కరణ

Published : Mar 04, 2023, 02:38 PM ISTUpdated : Mar 04, 2023, 02:50 PM IST
రేపు నిజామాబాద్ లో జంట పుస్తకాల ఆవిష్కరణ

సారాంశం

ప్రముఖ రచయితల కలం నుండి వెెలువడిన సాంత్వనమ్, మొలగొలుకు చేను పుస్తకాలను రేపు నిజామాబాద్ లో ఆవిష్కరించనున్నారు. 

తెలంగాణ రచయితల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు (5 మార్చి 2023 ఆదివారం) రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.రేపు సాయంత్రం నిజామాబాద్ లోని కేర్ డిగ్రీ కళాశాల ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.  

జాతీయ కవి,అమృతలత జీవన సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ రాధేయ వెలువరించిన  'సాంత్వనమ్ ' గ్రంథాన్ని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం ఆవిష్కరిస్తారు.అలాగే మరో ప్రసిద్ధ కవి పేరిశెట్టి శివకుమార్ రచించిన ' మొలగొలుకు చేను ' గ్రంథాన్ని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ ఆవిష్కరించనున్నారు. 

తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమాంలో గౌరవ అతిథి తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్, గ్రంథ సమీక్షకులు  ప్రఖ్యాత కవి జి నరసింహస్వామి. తెలంగాణ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం