ఎప్పుడూ వెలుతురు చూడాల్సిన వీళ్లు చీకటిలో గబ్బిలాలుగా వేలాడుతుంటారు అంటూ ఖమ్మం నుండి అంజనా శ్రీ రాసిన కవిత ' నల్లని చీకటి తెరలమాటున ' ఇక్కడ చదవండి :
నల్లని చీకటి తెరల మాటున
రకరకాలుగా ముసుగులు కప్పుకొని
ఎవరికి దొరకని దూర తీరాలలో సాగిపోతున్నానని అనుకుంటారు
జీవితమంతా చీకటి సముద్రంలో కలిసిపోయేదాకా
వెలుతురు చూడని వ్యక్తులు వీళ్ళు
జీవితమంతా సుఖ భోగ లాలస
చిందరవందరగా ఎక్కడెక్కడికో సాగేరు
చివరికి కుప్పకూలిపోయే సాహసాలు
ఎప్పుడూ వెలుతురు చూడాల్సిన వీళ్లు
చీకటిలో గబ్బిలాలుగా వేలాడుతుంటారు
పాడుబడిన శిధిల గృహాలలో
వీరి సహవాసపు మిత్రులతో ...