ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక - తలవంచితే తరలించుకుపోయే తొండాట అంటూ వఝల శివకుమార్ రాసిన కవిత " తొండాట " ఇక్కడ చదవండి:
ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక - తలవంచితే తరలించుకుపోయే తొండాట అంటూ వఝల శివకుమార్ రాసిన కవిత " తొండాట " ఇక్కడ చదవండి:
దుఃఖం
గుండె తలుపు తట్టే
ఆహ్వానం లేని అతిథి
అమాంతం ముంచెత్తే ప్రమేయం లేని ప్రభావం
ప్రమాదం అంచు మీది ఆమోదం
మన అంగీకారాలు అనంగీకారలతో ప్రమేయం లేని
ఆగమనం
తీరాలను ముంచెత్తే అల్పపీడనం
ప్రాంగణంలో నిరాశానిస్పృహలు నాటి
జీవచ్ఛవాల్ని వదిలి పోయే
నిరర్థక నిష్క్రమణం
ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక
పలకరింపుకే పులకించిపోయే పాచిక
నిరాసక్త జీవిక
నమ్మకాన్ని తొక్కిపట్టే
గాలితిత్తి తండ్లాట
తలవంచితే తరలించుకుపోయే తొండాట.