పిశాచిలాంటి మొగుడు పనీపాటా చేయక క్లబ్లులకు తిరిగి రాతిరేళ ఇంటికీ చేరి...పీకలదాక మెక్కి పందిరిమంచంమీద పెద్దపులిలా రూపాంతరంచెందుతాడంటారు... ఈ వాక్యాలలో స్త్రీ కోరేది ...ఏమిటి అనే ప్రశ్న ఉదయించకపోదు..
నరవాసన కొడితే తప్ప అది గొప్ప కవిత్వం కాదు"అన్నాడు డొనాల్డ్ డేవీ అనే అమెరికన్ కవి..నిజమే మానవగంధం గుభాళించంది అది కవిత్వం కాదు.కవిత్వం మానవత్వానికి పూచే పుష్పం..అదిలేంది కవిత్వం లేదు..మానవసంబంధాలకు మనం ఆపాదించే విలువలోనే మానవత్వం ఇమిడి ఉంది..ఈ మానవీయ అనుబంధాలు ,వేదనలూ తుర్లపాటి రాజేశ్వరి గారి కవిత్వాన్ని సారవంతము,రసవంతమూ చేసాయి..రాజేశ్వరి గారి కవితలలో మానవీయస్పర్శ,మానవసంబంధాల పరామర్శ ప్రధానాంశాలుగా ఉంటాయి..దేశీయ,అంతర్ధేశీయ సమస్యలకు స్పందిస్తూ వేదనతో కవితలను ఫూపొందిస్తూంటారు..ఇవి ఎప్పుడు చదివినా సమకాలీనతను ప్రతిబింబించడం చూడొచ్చు..
మానవతా సుగంధ పరిమళాన్ని ఎల్లలులేకుండా సాహిత్యం ద్వారా వ్యాప్తి చేసే వీరు స్త్రీ సమస్యలపై ఎక్కువగా స్పందించారు..వీరి కవితాసంపుటులు సీతా ఓసీతా,మనసైన చెలీ,రాగరాగిణీ,గాయాలచెట్టూ మేదలగూ కవితాసంపుటులను వెలువరించారు,రవీంద్రుని ఫ్రూట్ గేదరింగ్ ను ఆంగ్లం నుండి తెలుగుకు అనువాదం చెసారు..అమృత అనే ఒరియా కవితాసంపుటినీ తెలుగులోకి అనువాదం చెసారు..ఉల్లంఘన ప్రతిభారాయ్ గారి కథల అనువాదం చేసారు ఇలా ఎన్నో అనువాదాలు వారి భర్త సహకారంతో చేసారు..అనేక గ్రంథాలు,విమర్శవ్యాసాలు రూపకాలు నవలలు రాసారు...వీరి నవలలలో దీపం వెలిగింది,శశికళ,వంశీరవం అనేక పోటీలలో ఎంపికయ్యాయి...వీరి కెరటాలు నవల వనితాజ్యోతి ఛానల్ వారు సీరియల్ గా ప్రసారం చెసారు...
తెలుగు ప్రాంతంలో జన్మించిన వీరు ఉద్యోగరీత్యా ఒరిస్సాలోని బరంపుఫంలో స్థిరపడ్డారు..ఇటు ఒరియా భాషకూ,ఇటు తెలుగుకూ శక్తిమేరకూ తమ సేవలందిస్తునే ఉన్నారు...బరంపూరం యూనివర్సిటీలో రీడర్ గా వృత్తినీర్వహించి ప్రస్తుతం తమ విశ్రాంతసమయాన్ని గడుపుతున్నారు..తమ సమయాన్ని మరింతగా సాహిత్యసేవలో వెల్లబుచ్చుచున్నారు..అనేక ఆవార్డులతో సన్మానించబడినారు..ఒరిస్సాలో రీడర్ గా పనిచేస్తున్న వీరు కవయిత్రిగా లబ్థప్రతిష్టులే..నీలిమేఘాలు కవితాసంకలనంలోని వీరి ఊసరవెల్లి కవితను ఎవరూ మరిచిపోలేరు..ఇప్పటికీ ఈ కవయిత్రిలో స్త్రీవాదసృహ సజావుగా ఉందని చెప్పవచ్చును.
Also Read: కాల చక్రాన్ని మోసే ఆమెకు అమ్మవుతానంటాడు
ఎగిరేపావురం అనే కవిత డా..తుర్లపాటి రాజేశ్వరి గారి మనసైన చెలి అనే కవితాసంపుటి నుండి తీసుకోబడింది..వర్తమానసంఘటనలను తమ కవనంలో ప్రతిబింబించెలా రాసిన వీరి కవితలో ఆర్థ్రత బాగా వ్యక్తమయ్యింది..ఎగిరేపావురం కవితలో పురుషాహంకారాన్ని కళ్ళకు కట్టినట్లూ చిత్రీకరించి మన కళ్ళు చెమ్మగించెలా చేసారు..
"ఏ జన్మలోనో వాడికి బాకీ ఉన్నట్లు
ఒకటవతేదీన నెలకష్టం జీతంసొమ్మును
రెవెన్యూస్టాంపు మీద సంతకం చేసి తీసుకుంటున్నవేళ
చేయిచాచి నాచేతిలో పెట్టు అంటూ నక్షత్రకుడిలా...తయారవుతాడు...
అనే ప్రారంభవాక్యాలలో మహిళ శ్రమార్జితాన్ణీ ఉత్తిపున్నానికి దోచుకుంటుంన్న భర్తను పీడించడానికి ఉదాహరణగా ఉన్ణ నక్షత్రకుడంటూ వర్ణిస్తారు కవయిత్రి...సమస్యలోని లోతును చక్కని ఎత్తుగడతో ప్రారంభిస్తారు...
"ఉదయం ఆఫీసుకూ బయలుదేరేవేళ
అపరదానకర్ణుడిలా రెండురూపాయలు
నాచేతిలో పెడతాడు..."
తాను కష్టించిన సోమ్ముపై భర్త అనే వ్యక్తి పెత్తనాన్ని ఎత్తిచూపుతారు..
ఆఫీసుపనిచేసి అవసిసోలసి ఇంటికి వస్తే
అప్పగింతలవేళ అపురూపంగా చూసుకుంటానన్న అత్త అభినవ శిరోమణి నూతిపళ్ళెం నిండా ఉన్న అంట్లగిన్నెలను చూపుతుంది" పొద్దంతా కష్టపడి వచ్చినప్పటికీ....ఇంట్లో ఉన్న అత్త ఏ పని చేయక తనకై పనంతా ఆట్టే పెట్టి...ఆకలి కడుపుకింత అన్నానికి బదులు...నూతిపళ్ళెం నిండా అంట్లను చూపడం...ఆ మహిళను అత్త పెట్టే ఆరళ్ళ స్థాయినీ కళ్ళకు కడుతుంది
Also Read: మనసును వెంటాడే గుంజాటన - అఫ్సర్ కవిత్వం
మామ గారి నటన దాదాసాహేబ్ ఫాల్కే ఆవార్డు తీసుకోదగీనదిగా ఉంటుందని అంటారు...
పిశాచిలాంటి మొగుడు పనీపాటా చేయక క్లబ్లులకు తిరిగి రాతిరేళ ఇంటికీ చేరి...పీకలదాక మెక్కి పందిరిమంచంమీద పెద్దపులిలా రూపాంతరంచెందుతాడంటారు...
ఈ వాక్యాలలో స్త్రీ కోరేది ...ఏమిటి అనే ప్రశ్న ఉదయించకపోదు..
అంట్లుతోమి,బట్టలుతికీ ..అత్తా ఆడబిడ్డలు తిని వదిలిన అడుగూబొడుగు అన్నం తిని కొన ఊపిరిలో జీవచ్ఛవంలా వేరీపీకేసిన మొక్కలా పక్క మీదికి చేరితే..పొద్దంతా మెక్కి తయారుగున్న బాబుగారికి మరో ఆకలి నిద్రలేస్తుందంటారు...ఆ ఆకలిని కూడా తీర్చితే....
కట్టుబానిసలా కార్యక్రమాలు ముగించుకుని నాలుగుమెతుకులు తినగానే భళ్ళున వాంతి అయింది...
నిజమే ...మగాడి ఆకలికి ఫలితం ఆడదేగా అనుభవించాలి...
అత్త తనవంక చూసి ...ఒరే బుజ్జీ నీకు కొడుకు పుడతాడురా...మురిపెంగా...అనగానే....పనీపాటాలేనీ దగుల్భాజీ మొగుడు తానో హీరాలా కిలరెగరేస్తాడు....
ఉలిక్కి పడిన తాను ఆ పిశాచీసంతతి తనగర్భంలో రూపుదీద్దుకుంటోందని తలతిరాగిపోతుంటుంది...
అప్పటికైనా మేల్కోనకపోతే తాను ఎంతగా నష్టపోవాల్సివస్తుందో అర్ధమైపోయిన ఆ ఉద్యోగిని...
అపరదానకర్డుడు అలవాటుగా తనచెతిలో పెట్టీన రెండురూపాయలను వాడిచేతిలోనే పడేస్తుంది..తన ఐదంకెల జీతాన్ని ఇరవైనాలుగ్గంటల గొడ్డుచాకిరీని ఇక దక్కవు నీకు అంటుంది...
నిజమే ఎంతకాలంభరిస్తుంది మరి..గొడ్డులా చాకిరీ చేసి ఆ ఇంటినీ మేపి తాను మాత్రం అడుగూబొడుగులతో కడుపునింపుకోవడం...చివరిని తన గర్భాన్ని సైతం ఆ పిశాచులకు ధారబోయాల్సి రావడం ఎంతకని భరిస్తుంది ఆమె
రాస్తున్నా....నేనే నీకు చెల్లుచీటి అంటూ తిరుగుబాటుకు పూనుకుంటుంది..
ఆర్థ్రతా మాధుర్యాలనేవి లేక...పెళ్ళంటే ధనంతోనూ..నీచవాంఛలతోనూ ముడిపడినపుడు భార్యగా వచ్చీన బ్రతుకు
కట్టుబానిసగా మారినపుడు తనకాభార్యంత్వం వద్దంటూ....ఆమె విముక్తిని కోరుతుంది...ఆచారసాంప్రదాయాలపేరుతో మొగుడు కోట్టినా తిట్టినా పడుండాలని చెప్పె ఆనాటి సాంప్రదాయాలలో కూడా రాజేశ్వరి గిరు ఈ కవిత రాయడం ఓ విప్లవనాదమే..
అపుడా...స్త్రీ మానసిక స్తితిని చెప్పుతూ...
విముక్తి దిశగా..నేను
ఆషాడమేఘస్పర్శకే...తప్పిపోయిన వేర్లు
నాచేతికంటుతున్నాయి
స్వేచ్ఛను కోరుతూ తాను అనుభూతి చెందుతున్న తరుణాన్ని మరింతగా వివరిస్తూ...ఇలా అంటారు...
నేనిప్పుడు..ఇక విరిసిన మొక్కనే...ఎగిరేపావురాన్నే...అంటూ అర్ధవంతమైన...ఆర్థ్రతతో కూడిన వాక్యాలతో మన మనసూ కళ్ళూ చెమ్మగింపజేస్తారు రాజేశ్వరి గారూ...నిజమే...సమర్ధురాలై ఉండి కూడా...కేవలం మగాడూ...మగడూ అనే విషయంగా మాట్రమే అతని అదుపాజ్ఞలలో పీడీంచబడటం...కుటుంబానికి బానిసగా మారడం...క్షోభతో తనను తాను స్వేఛ్ఛా లోకంలోకి తెచ్చుకోవడం...చక్కని సలహాయే చాలామంది స్త్రీలకు...విముక్తి కోరుకునే అలలలకు...
ఇంత చక్కని కవితను రచించి...స్త్రీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండంటూ సందేశమిచ్చిన తుర్లపాటి రాజేశ్వరి గారికి ఆత్మీయాభినందనలు
- రమాదేవి బాలబోయిన