ప్రమోద్ అవంచ తన కవిత్వంలో సున్నితమైన భావాలను అతి సుందరంగా వ్యక్తం చేశారు. విషాద మాధుర్యం ఆయన కవితల్లో పలుకుతుంది. ప్రమోద్ ఆవంచ రాసిన ఓ కవిత మీ కోసం..
అడవి చెట్లలా
అల్లుకున్న
మన బంధం
మూసిన పిడికిలా
కొనసాగింది
శిశిరాలను ఎన్నో
చూసిన మనకు
రోజూ వసంతమే
ఇల్లంతా నిండిపోయి
నువ్వు నా మౌనాన్ని
శబ్దంగా మార్చావు
నువ్వంటే రోజూ పండగే
అందరి గుండెల్లో
కోలాహలమే
నీ మాటల్లో ఉత్సాహం
నీ నడవడిక లో
హుందాతనం
నీ నవ్వు లో
అమాయకత్వం
నాలో కొత్త మనిషిని
మేల్పొయాయి
నీ సాహచర్యం
జీవితంపై కొత్త
ఆశలు చిగురించాయి
ఎలా జీవించాలో
నేర్పించాయి
ఇప్పటికీ నువ్వు లేని
మన ఇంట్లో ఏదో
నీ అలికిడి
నా చెవులను
చేరుతూనే వుంది
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature