కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి కవిత: వెలుగులు కానరాని దేశం!

Published : Dec 20, 2019, 05:27 PM IST
కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి కవిత: వెలుగులు కానరాని దేశం!

సారాంశం

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ది పొందిన కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి. తెలుగు ఏషియానెట్ కోసం రాసిన కవితను పాఠకుల కోసం ఇక్కడి అందిస్తున్నాం.

దేశం
వెలిగిపోతూనే ఉంది
జనం తలాపున దీపాలతో!

కాలం
గడిచిపోతూనే ఉంది
మానని గాయాల గుర్తులతో!

పత్రికలా
విరాజిల్లుతూనే ఉన్నాయి
అధినేతల వాగ్దానాల మలినాలతో!

కంచెలు
చేల్లను మేస్తూనే ఉన్నాయి
చౌకీదార్ గాఢ నిద్ర మత్తులో!

బేటీ! నీవు
నిలువునా కాలిపోతూనే ఉన్నా
శ్రద్ధాంజలి క్రొవ్వొత్తుల నివాళులతో!

రాజకీయాలు
రావణ కాష్టాలవుతుంటే
దేశాన్ని వెతుక్కోవాలి స్మశానంలో!

ఎక్కడా వెలుగులు
కానరానీ దేశంలో "కోట్లా"
పిడికిళ్ళు దాక్కన్నాయి మార్చరీల్లో!!

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం