మనోహర్ రెడ్డి ఘంటా ఏషియా నెట్ న్యూస్ కోసం తెలుగు కవిత రాశారు. ఘంటారావం అనే కవితను చదవండి..
నిన్నటిని స్మరించాలి
నేటిని శ్వాసించాలి
రేపటిని రచించాలి
ఆలోచించే వేళ అన్వేషి
రాసేవేళ రుషి
కవి-మనిషి రూపంలో మార్గదర్శి
కవిత్వంలో నిజాయితీ తక్కువ
కారణం-కల్పన కాస్త ఎక్కువ
నేలల విలువలు నింగిలో
నైతిక విలువల నూతిలో
భావోద్వేగాల బలిపీఠంపై చట్టం
బాధ్యతాయుత భావన నేలమట్టం
ప్రతీకారం
కురుక్షేత్ర కారణం
పశ్చాత్తాపం
కళింగ కిరణం
అధికులమనుకుంటే
అహంకారం ఘీంకరించినట్లే
అల్పులమనుకుంటే
ఆత్మన్యూనత అంకురించినట్లే
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature