మల్యాల మనోహర్ రావు తెలుగు కవిత: విభజన

By telugu team  |  First Published Jan 31, 2020, 6:04 PM IST

న్యాయవాది మల్యాల మనోహర్ రావు విభజన పేరు మీద ఓ కవిత రాశారు. ఆ కవితను పాఠకుల  కోసం అందిస్తున్నాం.


కాలాన్ని విభజించి క్యాలెండర్ చేశాము భూగోళాన్ని విభజించి ఖండాలు చేసాము

 జలధి మీద గీతలు గీసి సముద్రాలు చేశాము ఆకాశంలో ఆంక్షలు పెట్టి గమనాన్ని  నిర్దేశించాము

Latest Videos

 దైవాన్ని విభజించి 
గ్రంథాలు రాశాము 
మత గ0ధాలు పూశాము

 నక్షత్రాలను విడదీసి రాశులుగా మార్చాము
జనాల జాతకాలు రాశాం

భూమిపై యుద్ధాలు చేసి  సరిహద్దులను గీసి
 జాతీయ జెండాలు పాతాం

 ఇంటికి గడప
 చేనుకు కంచె పునాదిగా ఎప్పుడైనా ఎక్కడైనా అనాదిగా విభజించే పాలించా0

 విభజన లేకుంటే
 గుర్తింపు లేదు అదే ఐడెంటిటీ......
 హద్దులే లేకుంటే భద్రత లేదు అదే సెక్యూరిటీ .......

విభజిస్తే కానీ గణితం బోధపడదు 
అసలు రంగు బయట పడదు
అభిమతం అర్థం కాదు

 ఏ కాలంలోనైనా గీసిన గీటు దాటితే ఉపద్రవమే

ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఇది నిర్వచనంకాదు 
కేవలం ఉపోద్ఘాతమే

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature

click me!