కందుకూరి శ్రీరాములు కవిత సినారె

By telugu team  |  First Published Jun 16, 2021, 12:45 PM IST

తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సినారె యాదిలో కందుకూరి శ్రీరాములు రాసిన కవిత  'సినారె' ఇక్కడ చదవండి.
 


కవిత ముందు
ఆ తరువాతే కవి

వాళ్లకూ అంతే
నాకూ అంతే !

Latest Videos

undefined

మంటల్లో మానవుడ్ని
చూశాను!

అప్పుడే అర్ధమైంది
మాడిపోతున్నాడు మనిషని -

ఎప్పుడో అది చాన్నాళ్లకింద - 
అయినా అప్పుడు 
నా చేత 
పద్యంరాయించింది

గణాలేంటో తెలియనప్పడే
కందమే 
అందమైన పద్యమని
ముద్దుగా
మొదటి పద్యం 
కందంరాసి పంపాను

రాసిన పద్యం ఒక్కటే
మహా గ్రంధమైనట్టు -

' నిన్నలేనిఅందమేదో
నిదుర లేచేనెందుకో '
రేడియో వినటమే తప్ప
మనిషి కనపడడు

పద్యం రాసిందానికి
ప్రత్యుత్తరం వచ్చింది
పది రోజులకు‌ -

ఆనందానికి అవధులు లేవు

కార్డు ముక్కనే !
ఇంటర్ బోర్డు సర్టిఫికేట్ 
పొందినట్టు -

అందులో మూడుముక్కలే
త్రిమూర్తుల్లాంటివి

నీ కవితా 'జిజ్ఞాస'ను
అభినందిస్తున్నా !
ఆ మూడు ముక్కలే 
వెంటపడ్డవి!
వేదించినవి!

ఎక్కడ 
మంటలు మానవుడు!
ఎక్కడ
విశ్వంభర  !

ఎక్కడ
తాటాకుల బడి !
ఎక్కడ
తాజ్ మహల్ లాంటి
ఓయు క్యాంపస్ !

ఎక్కడ
నన్నుదోచుకుందువటే

ఎక్కడ
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమనే 

ఎన్నడో
స్టేట్ సాహిత్య అకాడమి అవార్డు !
మొన్నెన్నడో
జ్ఞానపీఠం అవార్డు !


అప్పుడెప్పుడో
పద్యం రాస్తే !
ఇప్పుడెప్పుడో
నేను
కవిత్వధాతసుఖీభవ
కవిత రాశా !

గతంలో
కార్డు మీద అక్షరం!
వర్తమానంలో
క్లాసులో సాక్షాత్కారం!

మనసారా 
దీవించెను !
ప్రియ శిష్యునిగా
భావించెను !!

శరీరం
నశ్వరం!
ఆయన‌ లేకున్నా
ఆయన కవిత
శాశ్వతం !!

click me!