బెల్లంకొండ శ్రీవత్స తెలుగు కవిత: మళ్లీ కలుస్తాం

By telugu team  |  First Published Feb 3, 2020, 5:48 PM IST

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం అత్యంత ప్రధానమైంది. బెల్లంకొండ శ్రీవత్స రాసిన కవితను పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాం


అందరమూ కలుస్తాము
సెలవులు అయిపోతాయి
కలివిడి జ్ఞాపకాలు
తియ్యగారుచిస్తాయి.
ముచ్చటించుకోవడానికి
నాలోన ఒక స్నహితుడు ఉంటాడు కదా
కొత్త ఆలోచన లిస్తాడు
అమ్మానాన్న శృతి అక్కతాత నాని అందరిలానే
అక్షరం పదం వాక్యం కమ్మ
ఒంటరి  సముహా లు
ఒక్కసారి కడప దాటి చూస్తాను
ఎందరో ఒంటరులు
గుంపులుగా నడుస్తుంటారు.
రోజూవెతురు నిచ్చే సూర్యుడు
వొంటరినే
ప్రపంచమంతా
వెలుగు చిమ్మ తాడు.
గ్రహాలతో ఉంటాడు.
గమనంలో ఉంటాడు
కలయిక ఒక ధైర్యం
అందుకే మనం
ఒంటరులం కాము
పుస్తకం ఒంటరి కాదు 
సూర్యడు ఒంటరి కాదు 
మనం మళ్లీ కలుస్తాము.

click me!