తెలుగు సాహిత్యంలోని కవిత్వ ప్రక్రియలో అరుణ నారదభట్లది అందె వేసిన చేయి. ఆమె రాసిన ఉత్తదైంది కాలం అనే కవితను పాఠకుల కోసం అందిస్తున్నాం.
అన్నీ
చెట్టుకు వేలాడు దారపుపోగులయ్యాక...
పిచ్చుకల అరుపులు
మేఘానికేం ముద్దు
కలప ప్లాస్టికుదైనాక
రంపమైనా లోకువే
గూళ్ళన్నీ గబ్బిలాల వాసన
కూనల ఉనికి ప్రశ్నార్థకం
ఆకులు రాల్చుతూ అడవి
ఎవరో నిప్పంటించి వదిలేసారు
అన్నీ సగం కాలిన చెట్లు
అనూహ్యంగా వర్షం
కొమ్మలు విరిగి
పచ్చివాసన కొడుతూ
మసిసూరిన దేహాలు
సగంగా దహనమై
ప్రచారం
నిప్పు చల్లబడింది
గాలిసన్నగిల్లిన నిశ్శబ్దంలో!!