తెలుగు సాహిత్య సమాచారం: కథలు, పాటల పోటీలు

By telugu team  |  First Published Oct 1, 2020, 12:48 PM IST

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని  సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తోంది. రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నారు.


తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని  సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. ఒకో కథకు పదివేలుగా మూడు ఉత్తమ కథలకు ముఫ్ఫైవేల రుపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాం. కథలు అభ్యదయ భావాలతో  సమాజాన్ని పురోగమనం దిశగా నడిపించేవై ఉండాలి. కథలు యూనికోడ్ వర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. సొంత కథ అని హామీపత్రం కూడా తప్పనిసరిగా పంపాలి. కథలను15 అక్టోబర్ 2020 తేదిలోపు‌  tbkr.sahityam@gmail.com మెయిల్ కు పంపాలి.

రాయలసీమ పాటకు ఆహ్వానం

Latest Videos

రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన పాటలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా అందచేస్తాము.

పాట రాయలసీమ నిర్దిష్ట జీవితాన్ని  ప్రతిబింబించాలి.  పాట ప్రక్రియ లక్షణాలు తప్పని సరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. సీమ యాస మాండలికం, బాణీలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది ‌.  ఈ పోటీల కోసమే కొత్తగా రాయాలి.  అక్టోబరు నెల 15 వ తేదిలోపు రాసిన పాటను  9492287602 వాట్సప్ నెంబరుకు పంపాలి. 
దసరా సందర్భంగా అంతర్జాల వేదికలో ఏర్పాటు చేసే రాయలసీమ‌పాట కార్యక్రమంలో తమ పాటను ఎలా పాడాలో రచయితలు తెలియచేయవలసి ఉంటుంది.
వివరాలకు -
డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక
9963917187.

కవియాకూబ్@60 సంచికకి రచనలు ఆహ్వానం

ప్రముఖ కవి, సాహిత్యవేత్త, కవిసంగమం' సృష్టికర్త యాకూబ్ 60 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక సాహిత్య సంచిక వెలువరించదలిచాం. సాహిత్య అధ్యాపకుడిగా, కార్యకర్తగా, వక్తగా, సాహిత్యవిమర్శకుడిగా,యువకవుల కర్మాగారనిధిగా కవియాకూబ్ నిర్వహిస్తున్న పాత్ర అనితర సాధ్యమైనది.
కవియాకూబ్ సృజనకృషిపై కవులు, సాహిత్యకారుల విలువైన వ్యాసాలతో ఒక ప్రత్యేక సంచికను తీసుకురావాలని సంకల్పించాము. 
యాకూబ్ సృజనకృషిపై మీమీ సాహిత్య వ్యాసాలని అక్టోబర్ నెలాఖరులోగా  yakoobkavi@gmail.com ఈమెయిల్ కి పంపి తోడ్పాటు అందించాల్సిందిగా కోరుతున్నాం.

ప్రత్యేక సాహిత్య సంచిక కమిటీ సభ్యులు
పలమనేరు బాలాజీ
ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి
డాక్టర్ నూకతోటి రవికుమార్
వంశీకృష్ణ
అన్వర్
గుడిపాటి.

click me!