
'జల్లెడ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కందుకూరి అంజయ్య అధ్యక్షులుగా, ప్రముఖ తమిళ కవి జననేసన్ రాజగోపాల్ వీరరాఘవన్ ముఖ్య అతిథిగా, పుస్తక స్వీకర్తగా డా. నలిమెల భాస్కర్, అతిథులుగా గాజోజు నాగభూషణం, నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్ పాల్గొననున్నారని నిర్వహకులు తెలిపారు. బూర్ల వెంకటేశ్వర్లు పుస్తక పరిచయం చేస్తారు. సి.వి.కుమార్, తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.