బంజారాల చరిత్ర గొప్పది - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

By Siva Kodati  |  First Published Jan 3, 2024, 7:15 PM IST

హైకోర్టు న్యాయవాది, మాజీ వాణిజ్యపన్నుల అధికారి డా. ధనంజయ్ నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు సూర్యా ధనంజయ్ సంయుక్తంగా  బంజారా సాహిత్య అకాడమి సహకారంతో రచించిన   "బంజారా చరిత్ర" గ్రంథాన్ని ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవి‌ష్కరించారు.


హైకోర్టు న్యాయవాది, మాజీ వాణిజ్యపన్నుల అధికారి డా. ధనంజయ్ నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు సూర్యా ధనంజయ్ సంయుక్తంగా  బంజారా సాహిత్య అకాడమి సహకారంతో రచించిన   "బంజారా చరిత్ర" గ్రంథాన్ని ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవి‌ష్కరించారు. వివరాలకు ఇక్కడ చదవండి : 

లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తకరూపంలో సమాజానికి అందించడం చాలా అభినందనీయమని రేవంత్ రెడ్డి అన్నారు. హైకోర్టు న్యాయవాది, మాజీ వాణిజ్యపన్నుల అధికారి డా. ధనంజయ్ నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు సూర్యా ధనంజయ్ సంయుక్తంగా  బంజారా సాహిత్య అకాడమి సహకారంతో రచించిన   "బంజారా చరిత్ర" గ్రంథాన్ని డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఈ రోజు ఆవిష్కరించారు.

Latest Videos

రచయితలు గ్రంథం మొదటి ప్రతిని ముఖ్యమంత్రికి అందజేసి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన రచయితల జంటను అభినందించారు. ముఖ్యమంత్రి కరకమలాల మీదుగా చారిత్రక గ్రంథాన్ని ఆవిష్కరింపజేసుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలియజేస్తూ, ఈ సదవకాశాన్ని కలిగించిన ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి, కార్యాలయ సిబ్బందికి కుతజ్ఞతలు తెలిపారు.

నూతన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ, హైదరాబాద్ రూరల్ డివిజన్ రాష్ట్ర పన్నుల అధికారి శ్రీ. ఎన్. శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, రచయితలకు శుభాభినందనలు తెలిపారు.

click me!