పుస్తకాలు తీసుకునే తేదీని పొడగించండి

By telugu teamFirst Published Jun 11, 2020, 3:03 PM IST
Highlights

పుస్తకాలను తీసుకునే తేదీన పొడగించాలని తెలంగాణ పబ్లిషర్స్ అసోయేషన్ కోరుతోంది.చివరి తేదీ మార్చి 31, 2020.  కానీ కోవిడ్ - 19 లాక్ డౌన్ మూలంగా కొంత మంది రచయితలు, పబ్లిషర్స్ వారి వారి పుస్తకాలను గడువు ముగిసేలోగా సమర్పించలేకపోయారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ రచయితలు, పబ్లిషర్స్ నుండి పుస్తకాలు తీసుకునే తేదీని జూన్ 15 వరకు పొడిగించాలని తెలంగాణ పబ్లిషర్స్ అసోసియేషన్ కోరుతున్నది.  రాజా రామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, కోల్ కత్తా పథకం కింద తెలంగాణ గ్రంథాలయ సంస్థ 2017, 2018, 2019 సంవత్సరంలో అచ్చు వేసిన పుస్తకాలను రచయితలు, పబ్లిషర్స్ నుండి కోరారు. 

దీనికి చివరి తేదీ మార్చి 31, 2020.  కానీ కోవిడ్ - 19 లాక్ డౌన్ మూలంగా కొంత మంది రచయితలు, పబ్లిషర్స్ వారి వారి పుస్తకాలను గడువు ముగిసేలోగా సమర్పించలేకపోయారు.  

కనుక పుస్తకాలు స్వీకరించే గడువు తేదీని జూన్ 15 వరకు పొడిగించాలని, పేమెంట్ గేట్ వేను కూడా జూన్ 15 వరకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ పబ్లిషర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోయ చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి మాటూరి సూరిబాబు ఒక ప్రకటనలో కోరారు.

click me!