శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం

By SumaBala BukkaFirst Published Nov 26, 2022, 12:24 PM IST
Highlights

ఎంవీ రామిరెడ్డి రచించిన కథల సంపుటి ‘స్పర్శవేది’కి శ్రీ మక్కెన రామసుబ్బయ్య కధా  పురస్కారం.. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ రచించిన "పరావలయం"కవితా సంపుటికి ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం లభించింది.

శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్, విజయవాడవారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కథ, కవిత, ఇతర సాహితీ  ప్రక్రియలలో బహుమతి పొందిన రచయితలకు 24 -11-22  గురువారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు బ్రాడీపేటలో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది "శ్రీ మక్కెన రామసుబ్బయ్య కధా  పురస్కారం" ఎంవీ రామిరెడ్డి రచించిన కథల సంపుటి "స్పర్శవేది "కి బహుకరించారు.  "ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం " ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ రచించిన  "పరావలయం" అనే కవితా సంపుటికి   పురస్కారాన్ని అందజేశారు. " డా. కె వి రావు సాహితి పురస్కారం"  డా. చెన్నకేశవ రచించిన "కోకిల పాటలు" అనే  బాల సాహిత్యం పుస్తకానికి అందచేశారు. 

ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి సభాధ్యక్షులుగా రాయవరపు  లక్ష్మి శ్రీనివాస్, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు డా. నందమూరి లక్ష్మి పార్వతి , విశిష్ట అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్   మందపాటి శేషగిరిరావు, ఆంధ్రా బ్యాంకు పూర్వ డిజిఎం గంధం రవికుమార్, సభ నిర్వాహకులుగా పట్టాభి కళా పీఠము అధ్యక్షులు డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని విజేతలను అభినందిస్తూ రూ.7,000/ -ల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం  అందజేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ మక్కెన శ్రీను, రావి రంగారావు, ఆత్మకూరు రామకృష్ణ , పాలేరు పోతురాజు, శిఖా ఆకాశ్, పి. శ్రీనివాస్ గౌడ్ పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

click me!