మార్చి 17న 'వర్తన' రెండవ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ' కవిత్వ వాస్తవికత ' అనే అంశంపై కవి సిద్ధార్థ ప్రసంగిస్తారు.
సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదు కొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో రెండవ సమావేశం 17 మార్చి 2024 ఆదివారం ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది. ఈ సమావేశంలో ' కవిత్వ వాస్తవికత ' అనే అంశంపై కవి సిద్ధార్థ ప్రసంగిస్తారు. కవి సిద్ధార్థ కలం నుంచి దీపశీల, బొమ్మలుబాయి, JASMINE WATER'S (English) కవితా సంకలనాలు వెలువడ్డాయి.
కవి సిద్దార్థ గతంలో ఆంధ్రప్రభ ' సాహితీ గవాక్షం' లో ప్రజంటెన్స్ - పాఠకుని వాచకం శీర్షికన సంవత్సరంన్నరపాటు రాసిన సాహిత్య విమర్శనా వ్యాసాలు తెలుగు సాహిత్యంలో ఆరోగ్యకరమైన చర్చకు దారితీసి తెలుగు సాహిత్య పరిపుష్టకి దోహదపడ్డాయి.
ఈ సమావేశానికి డా. రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహిస్తారు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సమన్వయకర్త గా వ్యవహరిస్తారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులేనని వర్తన కార్యదర్శి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తెలిపారు.