ప్రముఖ కవి గన్ను కృష్ణమూర్తి అస్తమయం...

By Bukka Sumabala  |  First Published Sep 10, 2022, 8:52 AM IST

ప్రముఖ కవి, రచయిత గన్ను కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 


కామారెడ్డి : ప్రముఖ కవి, విమర్శకులు, కథా రచయిత, పరిశోధకులు  గన్ను కృష్ణమూర్తి (70) శుక్రవారం స్వర్గస్తులయ్యారు. గత 30 ఏళ్లుగా  కామారెడ్డిలో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి ఈ నెల 7న రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కామర్స్ లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించిన గన్ను కృష్ణమూర్తి అభిలేఖిని సాహితీ వేదిక ద్వారా వెలకట్టలేని సాహితీ సేవలను అందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేశారు.  గేయ కావ్యాలు, అనువాదాలు, దీర్ఘ  కవితలు, వేద పరిశోధనలు, మినీ కవితలు, పేరడీలు, పద్య  శతకములు, వేద పరిశోధన గ్రంథాలు రాశారు. 

Latest Videos

గన్ను కృష్ణమూర్తి 1945 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గన్ను జగదాంబ, గన్ను వైకుంఠం. వరంగల్ జిల్లా, నెక్కొండలో జన్మించాడు. వాణిజ్య శాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందారు. ఎంఫిల్ చేసిన తరువాత కొంతకాలం సర్వే ఆఫ్ ఇండియాలో, పోస్టల్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం కూడా చేశారు. 

click me!