రాజేంద్ర రాజుకు సినారె అవార్డు: కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీ విజేతలు వీరే

By telugu team  |  First Published Nov 27, 2021, 1:31 PM IST

విమలసాహితీ సమితి, పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన కుసుమ ధర్మన్న స్మారక‌ కవితల పోటీ ఫలితాలను విమల సాహితీ సమితి అధ్యక్షులు జెల్ది విద్యాధరరావు ఒక ప్రకటనలో తెలిపారు.


తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమి హైదరాబాదు వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతియేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సి.నా.రె. పురస్కారం  ఈ సంవత్సరానికి గాను కవి, రచయిత కాంచనపల్లి రాజేంద్ర రాజుకు ప్రదానం చేస్తున్నారు. ఈ రోజు (27-11-2021) సాయంత్రం 6గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో టెలివిజన్ రచయితల సంఘం స్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ సభాధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారు. ఈ సభకు విశిష్ట అతిథులు  డా. సముద్రాల వేణుగోపాలాచారి, డా.వకుళాభరణం కృష్ణ మోహన్, మామిడి హరికృష్ణ, డా. వెనిగళ్ళ రాంబాబు.

కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీ ఫలితాలు:

Latest Videos

విమలసాహితీ సమితి, పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన కుసుమ ధర్మన్న స్మారక‌ కవితల పోటీ ఫలితాలను విమల సాహితీ సమితి అధ్యక్షులు జెల్ది విద్యాధరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బహుమతుల ప్రదానోత్సవం డిసెంబర్‌ రెండో వారంలో హైదరాబాద్‌లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రథమ బహుమతి : అంటరాని ఋతువు - చొక్కాపు లక్ష్మనాయుడు
ద్వితీయ బహుమతి: దళిత వైతాళికుడు-బి.వి.వి. సత్యనారాయణ
తృతీయ: అన్నీ మర్యాదగానే - నూటెంకి రవీంద్ర 

ప్రత్యేక బహుమతులు ఈ కింది 12 మందికి...
1. నేలదిగిన నెలవంకలు - ఉదారి నారాయణ 
2. వేరుశనక్కాయలు- కె.ఆంజనేయకుమార్‌ 
3. గుడిసెతల్లి - గూండ్ల వెంకటనారాయణ 
4. నువ్వు వెళ్ళాక కూడా- లేదాళ్ళ రాజేశ్వరరావు 
5. బహుముఖాల వాళ్ళతో జాగ్రత్త- గోపగాని రవీందర్‌ 
6. కుసుమధర్మన్న - కె.రాధ 
7. వెక్కిళ్ళు - కరిపె రాజ్‌కుమార్‌ 
8. అంతరం-చెన్నూరి రాంబాబు 
9. మేమూ కలలు కంటాం-భూతం ముత్యాలు
10. పచ్చని చెట్టు - ఉప్పల పద్మ 
11. మా వాడెందుకో బడికి రానంటున్నాడు- చిత్తలూరి సత్యనారాయణ
12. మాట నినదించిన వేళ - దాకారపు బాబూరావు
ఇవి గాక మరో 16 మంది కవితలు సాధారణ ప్రచురణ కోసం ఎంపికయ్యాయి.

click me!