తెలుగు సాహిత్యంలో హైకూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కొన్ని హైకూలను ' బతుకు నడక 'లో చదవండి :
మనిషి కదా
కొమ్ములతో కుమ్మేసే
బతుకు ఆపు
అమ్మను తిన్నా
మట్టిని దోచుకున్నా
మౌనంలో మనం
హద్దులు లేని
నాగరికత ఏందో
కన్ను గానకా
శ్రమ సేద్యం
ఏకధాటి వర్షమే
అదో బతుకు!
స్నేహం తల్లిగా
కష్టాలూ కన్నీళ్ళలో
ఈతే జీవితం