అక్టోబర్ 2 న పాలమూరు సాహితి అవార్డు ప్రదానం :

By SumaBala Bukka  |  First Published Sep 30, 2023, 11:54 AM IST

పాలమూరు సాహితి  పురస్కారం -  2022 ను ప్రముఖ కవి డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు రచించిన "అంతరంగపు భాష" కు ఇస్తున్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చదవండి : 


తెలుగు సాహిత్యరంగంలో విశేషకృషి చేస్తున్న కవుల కవితాసంపుటాలకు గత పన్నెండు సంవత్సరాలుగా పాలమూరు సాహితి  పురస్కారాలను అందజేస్తున్నది. అందులో భాగంగా 2022 సంవత్సరానికి ప్రముఖ కవి డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు రచించిన "అంతరంగపు భాష" కవితాసంపుటి ఎంపికైంది.

ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ , కాళోజీ హాల్ లో అక్టోబర్ 2న ఉదయం పది గంటలకు జ‌రుగనున్నది. జిల్లా కళాకారుల సంస్థ అధ్యక్షులు వల్లపురెడ్డి మనోహర్ రెడ్డి అధ్యక్షతన కొనసాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, యువజన సర్వీసులు, పురావస్తు, పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ రానున్నారు. 

Latest Videos

విశిష్ట అతిథిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, గౌరవ అతిథిగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, ఆత్మీయ అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డిలు హాజరవుతారు. పాలమూరు సాహితి అవార్డు  వ్యవస్థాపకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  కవి మిత్రులందరినీ ఈ సభకు ఆహ్వానిస్తున్నారు.

click me!