కవి విల్సన్ రావు కొమ్మవరపుకు జాషువా పురస్కారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం వారిచే ప్రకటింపబడిన మహాకవి జాషువా  పురస్కారాన్ని ప్రముఖ కవి విల్సన్ రావు కొమ్మవరపు అందుకున్నారు. 

Google News Follow Us

మహాకవి గుఱ్ఱం జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరులో నిన్న జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం వారిచే ప్రకటింపబడిన మహాకవి జాషువా  పురస్కారాన్ని ప్రముఖ కవి విల్సన్ రావు కొమ్మవరపు స్వీకరించారు.  ఈ పురస్కారాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పి.రాజశేఖర్  మరియు  ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు  పి.విజయబాబు  చేతులమీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని కవి విల్సన్ రావు కొమ్మవరపు ఆనందం వ్యక్తం చేశారు.

కవి విల్సన్ రావు కొమ్మవరపు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అదీ జాషువా  పేరిట పురస్కారం అంటే కవులందరికీ ఎంతో గౌరవమని  అన్నారు.  వీరితోపాటు మరో పదిమంది కవులు ఈ పురస్కారం స్వీకరించారు.