ప్రకృతిని పరిహసించిన ఫలితం ఎలా ఉంటుందో పానుగంటి రామమూర్తి కవితలో చదవండి.
అడుగు తీసి
అడుగెయ్యాలంటే
అదేదో బూచి
ఆపత్కాలంలో అందించే
ఆపన్నహస్తానికీ
అదే అదృశ్య నిషి
మనిషి మనిషికి
ఇప్పుడు కొత్త కొత్త
వైద్య సరిహద్దులు
ప్రకృతిని
పరిహసించిన
ఫలితం
మనిషిని
వెంటాడుతున్న
ఆధునిక రోగం
కాలగమనంలో
జీవజాలాన్ని
ముంచెత్తనున్న
విషవాహిని.