మేలుకొలుపు శతకం గ్రంథావిష్కరణ

By telugu team  |  First Published Oct 3, 2020, 5:10 PM IST

నాగర్ కర్నూల్ జిల్లాపెంట్లవెల్లి మండల కేంద్రం లోని  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెలుగు భారతి సంస్థ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఘనంగా జరిగింది.


పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన కవి,రచయిత,స్వర్ణకారుడు ముమ్మిడి చంద్రశేఖరాచార్యులు రచించిన శ్రీ వేంకటేశ్వరుని మేలుకొలుపు శతకం గ్రంథం ఆవిష్కరణ శనివారం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లాపెంట్లవెల్లి మండల కేంద్రం లోని  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెలుగు భారతి సంస్థ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఘనంగా జరిగింది.

 ఆవిష్కరణ చేసిన జిల్లా బిజెపి అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ... నేటి సమాజంలోని పేదరికం, అవినీతి, వంచన, రాజకీయ కాలుష్యం, లంచగొండితనం, కల్తీ, అత్యాశవంటి సామాజికాంశాలను చంద్రశేఖరాచారి తన శతకంలో పద్య రూపకముగా పాఠకులకు అందించారని  పేర్కొన్నారు. 

Latest Videos

undefined

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగు భారతి సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి, సాహితీ వేత్త వేదార్థం మధుసూదన శర్మ మాట్లాడుతూ... వేమన పద్యాల వలే ఈ కవి రచించిన పద్యాలు సరళ, సుందర శైలిలో భక్తిని,నీతిని బోధిస్తున్నాయని  అన్నారు. 

ఈ కార్యక్రమంలో కవి,రచయిత వేముల కోటయ్య, ఉపాధ్యాయులు వెంకటేశ్వరా చారి, వెంకట రమణ, రాణి,స్థానిక నాయకులు బాల్ నారాయణ, శివయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

click me!