ఎం. ఎస్. నాయుడు తెలుగు కవిత: రాయి

By telugu team  |  First Published Feb 23, 2021, 1:28 PM IST

ప్రముఖ కవి ఎంఎస్ నాయుడు రాయి శీర్షికతో ఓ కవితను రాశారు. ఆ కవితను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. తెలుగు కవిత్వ ప్రపంచంలో ఎంఎస్ నాయుడిది విభిన్నమైన నడక.


ఎంతో వాగుతుంది. 
వినిపించదు. 
ఆకాశంలో అలలు. 
చల్లటి పదాలు. 
తడిచి విరిగే కల. 
కలలోనే నవ్వగలదు. 
చావు. 
ఏ తలుపో తెరిచింది. 
తెలుసుకుంది. 
తలుాపాలి బతికే వుంటే. 
బతికితే, మరో క్షణం, మరో మాట. 
మరో నిశ్శబ్దం పేరుకుపోయి. 
కదలని గది. 
కనిపించే రంగురంగుల నీడలు. 
గోడలలోని గోడలిని తాకలేనివి.  
చనిపోయే కన్నీరు ఆ రాయిలోనే. 
నీరు ఉంటుందా రాయిలో.
ఉండకపోతే, రాయి. 
అహో ఓహో అనే అనాలుకతో.

click me!