మోహన మణికంఠ ఉరిటి కవిత 'ప్రార్థన'

By telugu team  |  First Published Jul 8, 2021, 2:37 PM IST

కరోనా క‌ష్టాలను దాటించమని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్న మోహన మణికంఠ ఉరిటి కవిత 'ప్రార్థన' ఇక్కడ చదవండి.


చదువులమ్మ పక్కనే కూర్చోని వీణా స్వరాలు వినే వాడికి
విద్యాబుద్ధులు నేర్పే బడి పంతుళ్ల 
బాధలు వినపడలేదేమో!!

సిరిని చెంత పెట్టుకొని 
పాలసంద్రంలో శయనించే వాడికి
వలస కార్మికుల ఆకలిచావులు కానారాలేదేమో!!

Latest Videos

తాండవమాడే ముక్కంటీ 
ఈ కరోనా చేస్తున్న విలయతాండవాన్ని
ఏ ఒక్క కన్నుతోనైన చూడలేదేమో!!

సీత వియోగం బాధ తెలిసిన రామయ్య
మా ఆప్తుల వియోగం బాధలు తెలియడం లేదా?
నీ ఎదురులేని బాణాన్ని సంధించలేవా?

లక్షణుడి ప్రాణం కోసం సంజీవనినీ మోసుకొచ్చిన హనుమయ్య
లక్షలాది మంది ప్రాణాలు కాపాడటానికి ఇంకో సంజీవనీ తీసుకురాలేవా?
రామాజ్ఞ కోసం నిరీక్షిస్తూన్నావా?

కౌరవులతో యుద్ధానికి రథసారథిగా చక్రం తిప్పిన కిట్టయ్య
కరోనా పై యుద్ధానికి మరోసారి రథ సారథిగా రాలేవా??
నీ బావ అర్జునుడు లేడని ఆలోచిస్తూన్నావా?

click me!