శాసనమండలి అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.ఏనుగు నరసింహారెడ్డిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక మంగళవారం శాసనమండలిలోని ఆయన కార్యాలయంలో సన్మానించాయి.
నిరంతర అధ్యయనం, నిర్విరామ అభ్యాసం కవులకు అవసరమని శాసనమండలి అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఇటీవలి కాలం వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరుగా పనిచేసి, శాసనమండలి అధ్యక్షుడి వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.ఏనుగు నరసింహారెడ్డిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక మంగళవారం శాసనమండలిలోని ఆయన కార్యాలయంలో సన్మానించాయి. ఈ సందర్భంగా ఆ సంస్థల బాధ్యులతో ఆయన ఆత్మీయంగా సంభాషించారు.
అధ్యయనాన్ని వీడకుండా అభ్యాసాన్ని కొనసాగించాలని డా. ఏనుగు నరసింహారెడ్డి సూచించారు. వర్ధమాన కవులు సాహిత్య రంగంలో ఎదిగేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సాహిత్యంలోని వివిధ అంశాలపై కవులకు లోతైన అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వేదికల అధ్యక్షుడు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ప్రధాన కార్యదర్శి డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, కార్యదర్శి గుండం మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణ చంద్రమౌళి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కవులు కొమ్ము వరలక్ష్మి, తిరుపతి, వద్దిరాజు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.