మనోహర్ రెడ్డి గంటా మినీ కవితలు : ఘంటారావం

By SumaBala Bukka  |  First Published Jul 21, 2023, 1:18 PM IST

గత కొంతకాలంగా నిరంతరంగా ' ఘంటారావాన్ని ' వినిపిస్తున్న మనోహర్ రెడ్డి గంటా ' ఘంటారావాన్ని ' ఇక్కడ చదవండి : 


కొనుక్కున్న కీర్తి
ఎంతవరకు?
వేసిన దండ
వాడేవరకు

ఆధునిక అశ్వమేధంలో
అమ్మానాన్నలు
పరుగుల గుర్రాలుగా
చదువుల చిన్నారులు

Latest Videos

వాడు మగాడంటూ
అండగా నిలబడితే ఎలా?
చెడు నడతలో వాడు
కీచకుడవుతాడు కదా

శిఖరం చేరానని
సంబరపడకు
లోయలుంటాయని
మరువకు

సాకులు చెప్పడానికి
సాధన చేయకు
పనిలో ప్రావీణ్యం
చూపాలని మరువకు

click me!