మల్యాల మనోహర రావు కవిత : ఊహాలోకం

Published : Oct 11, 2023, 01:19 PM IST
మల్యాల మనోహర రావు కవిత : ఊహాలోకం

సారాంశం

నేను మాత్రం మధించి శోధించి నాలుగు వాక్యాలు వ్రాస్తూనే ఉంటాను అంటూ హన్మకొండ నుండి మల్యాల మనోహర రావు రాసిన కవిత ' ఊహాలోకం ' ఇక్కడ చదవండి : 

అతను ఎక్కడైనా
ఉండొచ్చు గాక 
అతల వితల
రసాతల పాతాళంలొ ఎక్కడైనా
ఉండవచ్చుగాక
చరచార సృష్టి సంబంధిత 
రాచకార్యములేవైనా చేయుచునుండవచ్చుగాక

నేను మాత్రం
మహాత్తరమైన 
నా ఊహాలోకంలోనే
ఉంటాను...
మధించి శోధించి
నాలుగు వాక్యాలు వ్రాస్తూనేఉంటాను

ఆతని సృష్టిలొ 
జననం మరణం 
లయం ప్రళయం
ఉండొచ్చుగాక..

నా కావ్య సృష్టిలొ
ప్రమోదం ప్రభోదం 
స్మృతి శృతి
అజరామరం

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం