తెలుగు సాహిత్యానికి మరింత సేవ చేసేందుకు రచయితలను ప్రోత్సహిస్తూ కవిత్వం, కథ, బాల సాహిత్యంలో గత ఏడేళ్లుగా పురస్కారాలు అందిస్తోంది మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్.
విజయవాడ: శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ విజయవాడ వారు 2022 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించారు. వీరు గత ఏడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కవిత్వం, కథ, బాల సాహిత్యంలో పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
ఈ సంవత్సరానికి గాను కవిత్వంలో ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ "పరావలయం " కవితా సంపుటిని, కథల్లో మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం ఎమ్వీ రామిరెడ్డి "స్పర్శవేది" కథా సంపుటిని, బాల సాహిత్యంలో డాక్టర్ కె.వి.రావు సాహితీ పురస్కారం డాక్టర్ చెన్నకేశవ "కోకిల పాటలు" ను న్యాయనిర్ణేతలు ఎంపిక చేసినట్టు శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పురస్కారానికి ఎంపికైన కవులు/రచయితలకు రూ.7,000/-, జ్ణాపిక మరియు ప్రశంసా పత్రం త్వరలో జరిగే సభలో సగౌరవంగా అందజేయనున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది.