యం. అనంతరామా రావు తెలుగు కవిత: బోసిపోయిన బడి గంట

Published : Jun 20, 2020, 04:53 PM IST
యం. అనంతరామా రావు తెలుగు కవిత: బోసిపోయిన బడి గంట

సారాంశం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలను కూడా కోవిడ్-19 వణికిస్తోంది. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ విషయంపై యం. అనంతరామారావు ఓ కవిత రాశారు.

గంట లేని బడి
తీర్థం లేని గుడి
కనిపించని హడావుడి
మళ్లీ చూస్తామా ఆ సందడి -
ఏకరూప దుస్తుల కొరకు
కొత్తవైన పుస్తకాల కొరకు
ఆరోగ్యాన్నిచ్చే హెల్త్ కిట్ల కొరకు
పరుగులే లేవు నేటి వరకు-
ఎటూ తోచని రాజ్యం
చదువులు లేని లోకం
భయం భయంగా జనం
అంతా అగమ్యగోచరం
ఎప్పుడొస్తాయో ఆ వైభోగపు రోజులు
అందుబాటులో ఉన్నప్పుడు తెలియవు    
                                              విలువలు                                                                             
ఓ చదువుల తల్లీ నీవే మాకు దిక్కు
ఆ అవకాశం దొరికితే ఎంతో ఉంటుంది కిక్కు

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం