జంగ వీరయ్యకు అండగా నిలిచిన కవి లోకం

By Siva Kodati  |  First Published Jun 25, 2023, 8:37 PM IST

తెరసం, జరసం, కవ్వం సాహితి, తెలంగాణ కవులు కళాకారుల ఐక్యవేదిక‌ సంయుక్త ఆద్వర్యంలో‌ ఈ రోజు సాయంత్రం జనగామ జిల్లా కేంద్రంలో  ఉద్విగ్న వాతావరణంలో జరిగింది


ఇటీవల మృతి చెందిన కవి జంగ వీరయ్య సంస్మరణ సభ  

తెరసం, జరసం, కవ్వం సాహితి, తెలంగాణ కవులు కళాకారుల ఐక్యవేదిక‌ సంయుక్త ఆద్వర్యంలో‌ ఈ రోజు సాయంత్రం జనగామ జిల్లా కేంద్రంలో  ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. తెలంగాణ సాహిత్య సమాజం జంగ వీరయ్య కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని   తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని  సిధారెడ్డి ఆ సభలో పాల్గొన్న వీరయ్య కుటుంబానికి ధైర్యం చెప్పారు.
 
తెరసం, జరసం, కవ్వం సాహితి, తెలంగాణ

Latest Videos

undefined

కవులు కళాకారుల ఐక్యవేదిక‌ సంయుక్త ఆద్వర్యంలో‌ ఆదివారం జరిగిన దివంగత కవి జంగ వీరయ్య సంస్మరణ సభకు తెరసం జిల్లా అధ్యక్షులు పానుగంటి రామమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మనందరి హృదయాల మీద పట్టు సాధించిన వీరయ్య వ్యక్తిత్వం కలిగిన కవి అని అన్నారు.‌ కింది తరాన్ని పై తరాన్ని మెప్పించిన కవి జంగ వీరయ్య అని కొనియాడారు.‌  పేరు చూసి ప్రేమించకు కవిత్వాన్ని ప్రేమించు అనే అలోచనకు‌ వీరయ్య జీవనం నిదర్శనమని సిధారెడ్డి అన్నారు.‌

తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ తెరసం వీరుడు వీరయ్య మరణం చాలా బాధాకరమని అన్నారు.  ఈ సందర్భంగా  సాహితి సంస్దలు కవులు, రచయితల నుండి సేకరించిన 2 లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను  జంగ వీరయ్య కుటుంబానికి అందజేశారు. తొలుత వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి. శంకర్, కవ్వం సాహితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూకట్ల తిరుపతి, హనుమకొండ వరంగల్ తెరసం అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు, హన్మకొండ వరంగల్ జిల్లాల తెరసం కార్యదర్శి బిల్ల మహేందర్, కందుకూరి శ్రీరాములు, కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ పోరెడ్డి రంగయ్య,‌ కవులు‌ కళాకారుల ఐక్యవేదిక‌ అధ్యక్షులు జి.కృష్ణ, జరసం అధ్యక్షులు అయిల సోమనర్సింహచారి, కవి హృదయం సాహిత్య వేదిక అధ్యక్షులు పెట్లోజు సోమేశ్వరాచారి, విశ్వంభర సాహిత్య సంస్ద అధ్యక్షులు రేణుకుంట్ల మురళి, లగిశెట్టి ప్రభాకర్, పొట్టబత్తిని భాస్కర్, నక్క సురేష్, కొలిపాక బాలయ్య, జీడి రమేష్, జంగ ముత్తయ్య, మల్లెకేడి రాములు  తదితరులు పాల్గొన్నారు.

click me!