కవి, రచయిత లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావుకు లయన్స్ జీవన సౌఫల్య పురస్కారం

By Siva Kodati  |  First Published Jan 13, 2023, 7:50 PM IST

ప్రముఖ కవి, రచయిత లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావుకి 2021- 22 లయన్ స్టిక్ సంవత్సరానికి అచీవ్ అవార్డ్స్ నైట్ మహోత్సవంలో జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు . 


లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థలో ప్రతిష్టాత్మమైన 320f జిల్లా గవర్నర్ గా 2019-20 లో సేవ చేసినందుకుగాను ప్రముఖ కవి, రచయిత లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావుకి 2021- 22 లయన్ స్టిక్ సంవత్సరానికి అచీవ్ అవార్డ్స్ నైట్ మహోత్సవంలో జీవన సాఫల్య పురస్కారాన్ని నిన్న హన్మకొండలోని ఎస్ ఆర్ సి స్కూల్ లో లయన్ అంతర్జాతీయ సంస్థ, వరంగల్  పక్షాన అందజేశారు.

వరంగల్ సాహితీ క్షేత్రంలో వికసించి వెలుగొంది, తెలంగాణ ఉద్యమానికి వారధిగా నిలిచి, వృత్తిరిత్యా మచ్చలేని ప్రభుత్వ అధికారిగా పదవీ విరమణ చేశారు శ్రీనివాసరావు. తర్వాత అనేక సామాజిక స్పృహగల సంస్థలతో మమేకమై, లయన్స్ సేవా సామ్రాజ్యంలో రాణించి, జిల్లా గవర్నర్ గా సేవా మార్గం వైపు పురోగమింపజేయుటలో విజయం సాధించినందుకు ఈ అవార్డును  అందజేశామని లయన్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఎం.విద్యాసాగర్ రెడ్డి, జిల్లా గవర్నర్  ముచ్చ రాజిరెడ్డి అన్నారు.

Latest Videos

undefined

ఈ కార్యక్రమంలో ప్రస్తుత గవర్నర్ కన్నా పరుశరాములు, వైస్ చైర్మన్ కోటేశ్వరావు, పూర్వపు జిల్లా గవర్నర్లు డా.కె.సుధాకర్ రెడ్డి, జాన్ బన్ని, గోపాల్ రెడ్డి మరియు ఉప జిల్లా గవర్నర్లు కె. వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొట్లపల్లి శ్రీనివాసరావుకు అవార్డు రావడం పట్ల జిల్లాలోని కవులు, రచయితలు, రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

 

click me!