కె ఎస్ అనంతాచార్య తెలుగు కవిత: దారి!

Published : Jun 26, 2020, 01:53 PM ISTUpdated : Jun 26, 2020, 01:54 PM IST
కె ఎస్ అనంతాచార్య తెలుగు కవిత: దారి!

సారాంశం

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. కెఎస్ అనంతాచార్య దారి అనే కవిత రాశారు. దాన్ని ఇక్కడ చదవండి.

దారిలో
ముళ్లను  ఏరుకుంటూ
రాళ్లను తొలగిస్తూ వెళ్తూ ఉంటే  


పూర్వపు మనుషుల అడుగు జాడలు చిత్రంగా అగుపించాయి
సత్యం లో నడిచిన 
 హరిశ్చంద్ర సంతతి

శుష్కాలంకారాలు
 గుండెల్నిపిండే 
గడ బిడల 
శబ్ధ   ప్రయోగాలు లేవు

వ్యాకరణ
వంది మాగదులై
దుష్ట సమాసాలను
మోయలేదు!

ఈటెలతో కాదు
మాటలతో రాజ్యాన్ని 
జయించిన దాఖలాలు

ఉప్పెనలను
ఉపద్రవాలను
ఎదురుకొన్న
శక్తి యుక్తి  

దారులిప్పుడు
రహదారులైనాయి
మాటలు మాత్రం
బోన్సాయ్ వృక్షాల్లా
కుండీల కతుక్కున్నాయి

ఏడారులైన మనస్సుల్లో
ఖర్జురం తీయదనంతో
 మాటల ఒయాసీస్సులు
  ప్రవహిస్తే ఎంత బాగుండు?

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం