కెఎస్ అనంతాచార్య కవిత : వీధి దీపం !!

By telugu team  |  First Published Nov 22, 2021, 8:39 AM IST

వీధి దీపం  వెలుగు కేతనం నిత్య నూతనం అంటూ కరీంనగర్ నుండి  కె ఎస్ అనంతాచార్య అందిస్తున్న 'వీధి దీపం !!' కవితను ఇక్కడ చదవండి:
 


సూరీడు వచ్చేదాక 
రాత్రి మీద 
వెలుతురు యుధ్ధం ప్రకటించిన ఒంటరి యోధ!
అన్వేషకుల మార్గ మిత్ర  దీపంత ! 
వెల్తురు కొలిమిలో మండే ఫిలమెంట్ కొర్రాయి!
నరాలై  శక్తిని ప్రవహించే 
రక్త బంధ  విద్యుత్ వాహిక  

పొద్దున పోయిన బిడ్డ కోసం
కల్లోల మానసంతో 
చేత కందిలితో ఎదురుచూసే
ముసలి లైట్ హౌస్ 

Latest Videos

మేధస్సులు రాపిడి చేసి
అక్షర యజ్ఞం ఆరంభించే
చెకుముకి రాయి !
జ్ఞాన సంకేత కలికి తురాయి ! 
ఒంటరి ఇంటి దీపం 
బక్కపేగుల ప్రతిరూపం 
దిక్కులేని  శవానికి జాగరణ 
చేసే విశ్వకుల దీపశిఖ
ఛీత్కారాలకు ఓదార్పు పలికే 
వెలుతురు వాక్యం

చెట్టు మీద వాలిన వెలుతురు పురుగులు
కొత్త ఆలోచనల మేలిమి గుబురులు! 

శీలాన్ని వెలకట్టే
పంచాయితీకి  ప్రత్యక్ష మూగ సాక్షి!

ప్రేమ రహస్యాలు దాచి ఉంచే 
ఫైర్ స్టేషన్
లేని  తామెరకు ప్రకటనల  జాలిమి లోషన్  ! 

ఊరి
రహస్యాలెరిగిన ఏకాక్షి! 
విప్పి చెప్పలేని  నిరక్షరకుక్షి

చలికి వానకి
వణుకు  లేక
కంటికి కునుకులేని
వెల్తురు పిట్ట!


వీధి దీపం  
వెలుగు కేతనం
నిత్య నూతనం.

click me!