సహిష్ణుత మనలో ఉంటే మన మనసూ పూలవనమే.. మన చిరునామ ఎవరూ చెప్పక్కర్లేదు!! అంటూ కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత ' చెప్పక్కర్లేని చిరునామా! ' ఇక్కడ చదవండి :
పూలు
నెత్తికి ఎత్తుకున్నప్పుడు
తరణీ
తరువూ ఒక్కటే!
అందాన్ని
సుగంధాన్నీ ధారబోసిన పూలు
ఎన్నడూ స్వోత్కర్షకు బోవు
చప్పట్లకూ ఆశ పడవు!
గాలికింత పరిమళాన్ని
నేలకింత సారాన్ని ధారబోస్తాయి
త్యాగమంటే ఏమిటంటే
పూల వైపే చూపాలి!
సహృదయత
సహిష్ణుత మనలో ఉంటే
మన మనసూ పూలవనమే
మన చిరునామ ఎవరూ చెప్పక్కర్లేదు!!