సినారె కవితా పురస్కారానికి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి "తొణకని వాక్యం" ఎంపిక

By telugu team  |  First Published Nov 25, 2020, 4:50 PM IST

యేటా సీనియర్ కవులకు ఇచ్చే సినారె కవితా పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవితా సంపుటి తొణకని వాక్యం దక్కించుకుంది. ఈ విషయాన్ని పురస్కార నిర్ణతలు ప్రకటించారు. 


సాహితీ గౌతమి- కరీంనగర్ ప్రతియేట ఇరు రాష్ట్రాలలో లబ్దప్రతిష్టులైన కవులకు ఇచ్చే సినారె పురస్కారం ఈ సంవత్సరం అనగా 2020కి గాను పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తొణకని వాక్యం కవితా సంపుటి ఎంపికైంది. ఈ విషయాన్ని పురస్కార కమిటీ కన్వీనర్ డాక్టర్ యెడవల్లి విజయేంద్ర రెడ్డి, సాహితీ గౌతమి అధ్యక్షకార్యదర్శులు డా"గండ్ర లక్ష్మణరావు,గాజుల రవీందర్ తెలియజేశారు.
      
ప్రతియేట ఇరురాష్ట్రాల స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే సాహితీగౌతమి సినారె పురస్కారం కోసం ఇరురాష్ట్రాల నుండి దాదాపుగా 250కవితాసంకలనాలు వచ్చాయని వాటిని ఈ సంవత్సరానికిగాను న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖకవులు కందుకూరి శ్రీరాములు, మందరపు హైమవతి, వెల్దండ నిత్యానందరావులకు పంపించామని,ఈ ముగ్గురి న్యాయనిర్ణేతలనుండి వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ సంవత్సరం తొణకనివాక్యం ఎంపికైందని వారు చెప్పారు.
       
 త్వరలోనే ఈ పురస్కార ప్రదానోత్సవం ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.ఈ ఫలితాల ప్రకటనలో పురస్కార కమిటీ సభ్యులు దాస్యం సేనాధిపతి, డా.బి.వి.ఎన్.స్వామి పాల్గొన్నారు.

click me!