తెలంగాణ రచయితల సంఘం, వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహించే ' కవిత్వంతో కలుద్దాం ' కార్యక్రమం ఈ నెల ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్ రెడ్డి స్వగృహంలో జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదవండి :
తెలంగాణ రచయితల సంఘం, వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహించే ' కవిత్వంతో కలుద్దాం ' కార్యక్రమం ఈ నెల ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్ రెడ్డి స్వగృహంలో జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదవండి :
ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్ రెడ్డి స్వగృహం వరంగల్ లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కవిత్వంతో కలుద్దాం -21వ కార్యక్రమం ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనషులను కలిపేదే కవిత్వమని, కవులు వారిదైన సొంత ముద్రను ఏర్పాటు చేసుకొని రచనలు చేయాలని అన్నారు.
సంస్థ కార్యదర్శి బిల్ల మహేందర్ ఆధ్వర్యంలో కవుల కవిత్వ పఠనం అనంతరం ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి కవితలను విశ్లేసిస్తూ కవికి లోతైన చూపు ఉన్నప్పుడు మాత్రమే మంచి కవిత్వం రాయగలుగుతాడని అన్నారు. కార్యక్రమంలో దారు శిల్పి మర్రి గోపాల్ రెడ్డిని సత్కరించారు. కవులు కేశిరెడ్డి మాధవి, అరవింద, అంజనీదేవి, చింతల కమల, రామా రత్నమాల, గజ్వెల్లి రామనరసింహస్వామి, శ్రీధర్ స్వామి, సురేందర్ ,కోడం కుమారస్వామి, లీల తదితరులు పాల్గొన్నారు