ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం: కవితా సంపుటాలకు ఆహ్వానం

Siva Kodati |  
Published : Aug 06, 2022, 05:31 PM ISTUpdated : Aug 06, 2022, 05:38 PM IST
ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం: కవితా సంపుటాలకు ఆహ్వానం

సారాంశం

అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను కవిత్వానికి ప్రదానం చేయుటకు కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు.

నిబంధనలు 

- 2018 జూలై నుండి 2022 జూన్ వరకు ప్రచురించిన సంపుటాలు మాత్రమే నాలుగు ప్రతులు పంపాలి . సంకలనాలు (collections) స్వీకరించబడవు. వచన, గేయ కవితా సంపుటాలు, దీర్ఘ కవితలు పంపవచ్చు. ప్రతులు చేరవలసిన చివరి తేది 31 ఆగస్టు 2022 .

ఎంపికైన గ్రంథకర్తకు అక్టోబర్ 2022లో హనుమకొండలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో  రూ.5,000/- నగదు, శాలువ, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం చేస్తారని అరసం వరంగల్ అధ్యక్షులు నిధి, ప్రధాన కార్యదర్శి పల్లేరు వీరస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

పుస్తకాలు పంపాల్సిన చిరునామా : 

చందనాల సుమిత్ర, ఇంటి నెంబర్, 
5 - 11 - 902, హనమాన్ నగర్,  
పెగడపల్లి క్రాస్ రోడ్ , హనమకొండ - 506009

ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు : 9701000306, 9441602605, 9550217802

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం