కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి - ఆజాదీ - ఆవిష్కరణ

Published : Nov 25, 2023, 12:42 PM IST
కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి - ఆజాదీ - ఆవిష్కరణ

సారాంశం

కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి - ఆజాదీ - ఆవిష్కరణ సభ 26 నవంబర్‌ 2023 ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది. 

కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి - ఆజాదీ - ఆవిష్కరణ సభకు డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ అధ్యక్షత వహిస్తారు.  పుస్తకాన్ని కె. ఆనందాచారి ఆవిష్కరిస్తారు. సభలో డా. కాంచనపల్లి గోవర్థనరాజు, కొమ్మవరపు విల్సన్‌రావు, ఎం. నారాయణశర్మ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తారు. ఈ సభ 26 నవంబర్‌ 2023 ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది.   

సమాజంలోని సంఘటనలు, వ్యవస్థీకృత దుర్మార్గానికి బలయ్యే మనుషుల సంవేదనలు చూసి చలించి కవిత్వం రాసే కవి కరిపె రాజ్‌కుమార్‌ గతంలో వనఝరి, స్వేచ్చాగానం, Unsung Adilabad కవితా సంపుటాలు వెలువరించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరిని 2016లో  ఉత్తమ సాహితీవేత్తగా గుర్తించి గౌరవించింది.  ఇప్పుడు ఈ ఆవిష్కరణ సభకు సాహిత్యాభిమానులను, కవులను పాలపిట్ట బుక్స్‌ సాదరంగా ఆహ్వానిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం