కందాళై రాఘవాచార్య తెలుగు కవిత: చెడగొట్టు

By telugu team  |  First Published Dec 3, 2020, 10:21 AM IST

మనిషి చెడగొట్టు  తానాన్ని  కందాళై రాఘవాచార్య చక్కగా తమ కవితలో వివరించారు చదవండి.


అడవి పై వల వేసి
ఎడారిలో తప్పిపోతాడు ?!
*            *            *
నదులను ఆమ్లఆమ్లంచేసి
గుక్కెడు గుక్కెడు నీటికోసం
గుక్క పెట్టి ఏడుస్తాడు ?!
    *          *         * 
తెలివి మీరి
తన తల పై తానే
చేయి పెట్టుకుని
బూడిద బొమ్మై పోతాడు !?
*             *          *
మనిషి
పుట్వడిగా
ఎంత ఎంత గొప్పో
అంత చెడగొట్టు ?!
*             *            *
స్వర్గాన్ని
నరకం చేసుకుని - 
కడాయిలో
జీవితాంతం ఈదుతుంటాడు !?

click me!