కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.సదానందంకు యునైటెడ్ కింగ్‌డమ్ రాయల్ సొసైటీ ఆఫ్ బయోటెక్నాలజీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాస రావు, విశ్రాంత ఆచార్యలు,బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు
కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.సదానందంకు యునైటెడ్ కింగ్‌డమ్ రాయల్ సొసైటీ ఆఫ్ బయోటెక్నాలజీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీలో ఫెలోషిప్ ప్రపంచంలో అత్యున్నత స్థాయి సభ్యత్వం. జీవశాస్త్రంలో ఆచార్య సదానందం చేసిన విస్తృత పరిశోధనలకు ప్రతిభకు గుర్తింపుగా యూకే రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ ఫెలోగా ఎంపికయ్యారు.
ఆచార్య. ఎ. సదానందం గతంలో డాడ్ ఫెలో, రీసెర్చ్ ఫెలోగా 4 సార్లు జర్మనీని.. ఆస్ట్రేలియా, హంగరీ, నెదర్లాండ్స్‌తో సహా ఇతర దేశాలను సందర్శించారు. బీఎం జోహ్రీ మెమోరియల్ అవార్డు- సొసైటీ ఫర్ ప్లాంట్ రీసెర్చ్ (2023), సిఎస్ఐఅర్ ఎమెరిటస్ సైంటిస్ట్ (2019), పంచనన్ మహేశ్వరి మెడల్-ఇండియన్ బొటానికల్ సొసైటీ (2018), ఫెలో-తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ ( 2016), యూజీసీ ఫ్యాకల్టీ ఫెలో (2016), విజిటింగ్ రీసెర్చ్ ప్రొఫెసర్ ముర్డోక్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా (2010), ఏపీ స్టేట్ మెరిటోరియస్ టీచర్ అవార్డు (2009), ఏపీ ఉత్తమ సైంటిస్ట్ అవార్డు (2008), ఉత్తమ ఉపాధ్యాయుడు , వృక్షశాస్త్రంలో పరిశోధకుడు (2006)తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్థల నుంచి అవార్డ్‌లు పొందారు.
ఆచార్య సదానందం బాటనీ డిపార్ట్‌మెంట్, యూనివర్శిటీకి వివిధ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో సేవలందించారు. ఈ సందర్భంగా ఆచార్య సదానందంను వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాస రావు, విశ్రాంత ఆచార్యలు,బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు