తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

By telugu team  |  First Published Sep 20, 2019, 3:48 PM IST

పార్టీల తీరుపై జాయ్ ఓ కవిత రాశాడు. పార్టీల ఊరేగింపులపై, ఆ పార్టీల జెండాలను మోస్తున్నవారిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఈ కవిత రాశాడు


తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

మహా నగరం కిక్కిరిసిపోతుంది..
ఎగిరి పడుతున్న కండువాలు, జెండాలను మోస్తూ..
ఏ పార్టీనో..?
నాయకుడు ఎవ్వరో తెలియని నాటు పెగ్గుకోట్టిన బుజానికి ఊగుతూ..
కూలి పని కన్నా 100ఎక్కువ ఇస్తున్నారని నెత్తికి కట్టుకున్న మహిళలు..!
ఎర్రటి ఎండలో కూడా రంగులు సల్లుకున్న ముసలాయన..?

Latest Videos

undefined

ఎవడోచ్చే - ఎవడు పోయే..
ఎంకటి నోట్లో కాలుతున్న రూపాయి సిగరెట్టుకేం తెలుసు జెండేవరిదో..
ట్రాఫిక్కు నడుమ కవాతులు చేసే బ్యాండుమేళంకి ఏం తెలుసు ఈ కండువ ఎవరిదో..!
మున్సిపాలిటి వర్కర్లకు తెలుసు ఎన్ని రోడ్డున పడ్డాయో..
ఎంత చిరాకుగా వాటిని మోశారో..?
ఎవడోచ్చి ఇస్తున్నాడు బుక్కెడు బువ్వ..
ఎవడొచ్చి పోస్తున్నాడు క్వటరు లిక్కరు...

ఈరోజేదో దొరికింది జెండా..
గట్టిగా కనపడేలా ఒళ్ళంతా కట్టుకున్న కండువ..!
ఎటు తిసుకుపోతున్నారో తెల్వదు..?
సిటిల దింపిన్లు పొద్దుగాల ట్రాక్టర్ల తీసుకొచ్చి..!

ఈ పార్టీ జెండా - కండువ ఇంతకుముందు చూసిన..!
కాని..?
ఈ సారి ఎవరి కోసం ఈ కండువ కట్టుకున్ననో తెల్వదు..?
ఈ జెండా ఎందుకు భూజానికి ఎత్తుకున్ననో తెల్వదు..?
కానీ కిందటి కంటే ఇప్పుడు ఇచ్చే పచ్చనోటు పెద్దది..!
ఇప్పుడు పంచె క్వటరు సీస కొత్తది..!
ఈ సిటిలనే బిర్యానీ తిని పోవొచ్చు..!
సగటు కూలి బతుకుకు ఈరోజు సాలు..?

హుం..!

ఎవడి వల్ల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!
రైతులు రోడ్డుకెక్కి మద్దతు ధరకోసం గోసపడుతున్న..?
గ్రూప్ విద్యార్థులు సాముహిక మరణాలకు అనుమతులు అడుగుతున్న...!
పోలిస్ నౌకరికోసం ఆరాటపడి గుండెలు ఆగుతున్న..!
పురిటినొప్పులతో దావఖానకు పొతే నర్సు పురుడు పోస్తుంన్న..!
రోజు కొన్ని వందలమంది ధర్నా చౌక్ దగ్గిర గొంతెత్తి అరుస్తున్న..!

ఈ పార్టి జెండాలు మాత్రం ఎగుర్తున్నాయి..?
ఆటోలకు మెరుస్తున్నాయి..!
బైకులకు చుట్టుకుంటున్నాయి..!
సిటిల ట్రాక్టర్లు చెక్కర్లు కొడుతున్నాయి..? 

ఎవడబ్బ సొమ్ము ఈ గంజి బట్టల నాయకుల దగ్గరున్నది..!
ఎవడిచ్చిన పెత్తనం ఇట్ల నగరంలోకి కులిలను దించడానికి..!
ఎవడెం చేశాడని పైసలియ్యకుంటే జనం వత్తలేరు..!
ఎవడికేం ప్రేముందని దగ్గిరకు పిలుచుకుని మాట్లాడటానికి..!

జెండాలకేం తెలుసు ఓటుకు తనే కారణమని..!
కండువాలకేం తెలుసు ఆ నాయకుని ముద్రిదని..!
స్తిక్కర్లకేం తెలుసు ట్రాఫిక్ పోలిసుల మాట వినకుండా బండి తిరుగుతుందని..!
పార్టి రంగులకేం తెలుసు హోలీ కాకున్నా రోడ్డును మరకలు చేస్తున్నాం అని..!

సిగ్గు పడాలి ఈ జెండాలను కండువలను పంచె బదులు..!
పథకాల అమలులో చేసిన ద్రోహాన్ని గుర్తు తెచ్చుకొని..!
సిగ్గు పడాలి ఈ కండువాలు కప్పేముందు..?
ముసుగులో బతుకుతూ అబద్ధపు హామీలు ప్రకటిస్తున్నందుకు..?

- జాయ్

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

కవితలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

click me!