తెలుగు సాహితిలో దాసరి మోహన్ తెలుగు కవిత అలసిపోతున్నాను ఇక్కడ ప్రచురిస్తున్నాం. జీవితంలో ఏయే విషయాల్లో అలసిపోవడం ఉంటుందనే విషయాన్ని ఈ తెలుగు కవి తన కవిత్వంలో వ్యక్తీకరించాడు.
ఆఫీస్ లో బాస్ నీ
ఇంట్లో శ్రీమతినీ
పొగిడి పొగిడి అలిసిపోతుంటాను
వూరించే వెన్నలని
కుదరని కోరికలను
మోహించి మోహించి అలిసి పోతున్నాను
ధన వంతుల దగ్గర
హోదా హంగులకి
వంగి వంగి అలిసిపోతున్నాను
కొండలెక్కి కానుకలు వేసి
కోరికలు మొక్కుకుని
దొర్లి దొర్లి అలిసిపోతున్నాను
మంచి మార్పు రావాలని
అన్యాయం ఆగిపోవాలని
రాసి రాసి అలిసిపోతున్నాను
అలిసి పోయి ఆగిపోతే
వెనక పడతా నేమోనని
గుబులు గుబులు గా పయనిస్తుంటాను..
- దాసరి మోహన్
కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. email: pratapreddy@asianetnews.in