తెలుగు సాహిత్యంలో కవిత్వ ప్రక్రియకు విశిష్టమైన స్థానం ఉంది. జన్ను లక్ష్మి రాసిన కవితను ఇక్కడ చదవండి.
సముద్రంలో బిందువు కాదు...
బిందువులోనే
సముద్రం దాగివుందని !
ఓయ్....
అంత మాటంటావా ?
undefined
అనంత విశ్వంలో
అణువులు కాదు...
అణువులోనే
విశ్వం దాగివుందని !
నిన్నే...ఎవరైనా వింటే
ఏమనుకుంటారు !?
ఆకాశంలో
నక్షత్రాలు కాదు....
నక్షత్రాల మధ్యనే
ఆకాశం వుందని !
ఇరుకుగదిలో..
ఒంటరిగా
వ్యాసపీఠం..
ముందు కూర్చుని
పుంఖాను పుంఖాలుగా
ఆణిముత్యాలు...
ఒలకబోస్తావెందుకు !?
ఇక లాభం లేదు
బయటికి పోదాం....
జీవితం ముసుగులు తీసేసి
హాయిగా గాలి పీల్చుకుందాం !!