ఇరుగు పొరుగు: అనువాద కవిత జో హెల్లర్

Published : Dec 22, 2020, 01:32 PM IST
ఇరుగు పొరుగు: అనువాద కవిత జో హెల్లర్

సారాంశం

ఇరుగు పొరుగు కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ అనువాద కవితలను అందిస్తున్నారు. వాటిలో ప్రస్తుతం అందిస్తున్న కవిత రెండోది. చదవండి

వాస్తవ కథ,
గౌరవప్రదమయిన మాట 

జేసెఫ్ హెల్లర్, ప్రముఖ హాస్య రచయిత 
ఇపుడు లేడు, మరణించాడు 

నేనూ హెల్లర్ షెల్టర్ ఇలాండ్ లో 
ఓ కోటీశ్వరుడిచ్చిన విందులో వున్నాం

జో నీ నవల 'కాచ్-22'
మొత్తం సంపాదించిన దానికంటే 
మన ఆతిథేయి Host నిన్న ఒక్క రోజులో 
సంపాదించి వుంటాడు 

నీకేమనిపిస్తోంది అన్నాన్నేను

నేను పొందిన దాన్ని అతను తన 
జీవిత కాలంలో పొందలేడు అన్నాడు జో
'ఈ భూమ్మీద అంతా గొప్పదేమిటో- అన్నాను

'నాకు సరిపడినంత జ్ఞానం' అన్నాడు జో 

చాలా గొప్ప మాట,

ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో జో .

ఇంగ్లీష్ మూలం :   కుర్ట్ వొన్నేగుట్

 
ఇంగ్లీష్ స్వేచ్ఛాను వాదం : వారాల ఆనంద్

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం