ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ రెండు ఆంగ్ల కవితలకు తెలుగు అనువాదం అందించారు. ఆ కవితలను ఇక్కడ చదవండి.
విపత్తు
నువ్వేమో నిన్ను వదిలి వెళ్లిపోయిన
ప్రేమకోసం దుఃఖిస్తావు
నేనేమో ఎప్పటికీ దరిచేరని
ప్రేమకోసం దుఃఖిస్తాను
పగిలిన హృదయాలు
ఋతువుల్లాగా భిన్నమయినవయినా
ఒకేలా ఉంటాయి
బహుశా అందుకేనేమో
కన్నీళ్లకు ఏ రంగూ ఉండదు
undefined
ఇంగ్లిష్ : అరిజిత్ రావు
తెలుగు: వారాల ఆనంద్
మాటల్ని ఏరుకుంటాను
నేను మాటల్ని ఏరుకుంటాను
అవి నానుంచి పరుగెడతాయి
మళ్ళీ ఏరుకుంటాను
సున్నితంగా పట్టుకుంటాను
పట్టుకుని వాటితో ఆడుకుంటాను
వాటి రూపాన్ని సరిదిద్దుతాను మార్చేస్తాను
మాటలు నాతొ ఆడుకుంటాయి
నృత్యం చేస్తాయి
నా వేళ్ళ మధ్య నుంచి అవి జారి పోతాయి
వాటి గమ్యాన్ని అవే రూపొందించుకుంటాయి
మాటలు మారిపోతాయి
నవ్య వాస్తవాన్ని సంతరించుకుంటాయి
నేనో కొత్త కవిత
‘సంతాప గీతం’
జనించడాన్ని చూస్తాను
ఆంగ్ల మూలం: సతరూప రుద్రపాల్
తెలుగు: వారాల ఆనంద్