ఇరుగు పొరుగు: జూన్ జోర్డన్ ఈ కవితలు

Published : Mar 09, 2021, 03:29 PM IST
ఇరుగు పొరుగు: జూన్ జోర్డన్ ఈ కవితలు

సారాంశం

ఇరుగు పొరుగులో భాగంగా ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ జూన్ జోర్డన్ కవితను తెలుగులోకి అనువదించారు. ఆ కవితను చదవండి.

నువ్వు ఎవరయినా 
నిన్ను చేరేందుకు 
అంధకారంలో నేను చేసే ప్రయత్నమే 
ఈ కవితలు
ప్రవహించే నీటిలో 
గులక రాళ్ళు 
ఈ పదాలు
నా ప్రేమకూ వాంఛకూ
నిరాశాపూరిత హస్తాలు 
అస్తిపంజరం లాంటి ఈ పంక్తులు
నా చుట్టూ వున్న అపరిచితుల్ని 
ఆరాధించడం నేర్చుకుంటున్నాను 
నేనో అపరిచితుణ్ణి
నువ్వెవరయినా కావచ్చు 
నేనెవరినయినా అవొచ్చు .

మూలం: జూన్ జోర్డన్ 
అనువాదం: వారాల ఆనంద్ 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం