ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ ఆఘా షహీద్ అలీ పిలుపు కవితను అందించారు. ఆ కవితను మీరు ఇక్కడ చదవండి.
కళ్ళు మూసుకుంటాను
ఇంట్లోకి చొచ్చుకొచ్చి
అమ్మా నాన్నల ప్రేమను దోచుకొనే
చల్లటి కాశ్మీర్ చందమామ
నన్ను వదిలిపెట్టదు
నేను చేతులు తెరుస్తాను
అంతా ఖాళీ ఖాళీ
ఇది విదేశీ దుఃఖం
'ఇంటికి ఎప్పుడు వస్తున్నావు'
నాన్న అడుగుతాడు
మళ్ళీ మళ్ళీ అడుగుతాడు
మహాసముద్రం ఒక్కసారిగా రక్త నాళాల్లో
పరుగులు పెడుతుంది
'అంతా బాగున్నారా'
నేను బిగ్గరగా అడుగుతాను
మాటలు నిర్జీవమయిపోతాయి
రక్త నాళాల్లో నీరింకిపోతుంది
సముద్రం నిశ్శబ్దమవుతుంది
దానిపై చల్లని పూర్ణ చంద్రుడు పరుచుకుంటాడు.
ఇంగ్లీష్: ఆఘా షహీద్ అలీ
తెలుగు : వారాల ఆనంద్