తెలుగు సాహిత్యంలో కవిత్వం విశిష్టమైంది. ప్రముఖ కవి హనీఫ్ వ్యక్తీకరణ పేర ఓ కవిత రాశారు. ఆ కవితను మీకు ఇక్కడ అందిస్తున్నాం
కురిసిన చినుకులన్నీ
భూమిని ప్రేమించవు
లోనికి ఇంకినవే గదా
ప్రవహించి విధ్వంసం
సృష్టించిన వన్నీ
సముద్రాన్ని ప్రేమిస్తాయి !
వ్రణంలా అంటిపెట్టుకొని
సెల పెడుతూ వుంటుంది
తల బాదుకొని, బాదుకొని
భూమిని కరిగించేయాలని చూస్తుంది
ఇలకి మొలకెత్తినవే గదా
ప్రేమ చిహ్న ప్రతీకలు.